: 'కళానికేతన్' ఎండీ, ఆయన భార్యపై ఛీటింగ్ కేసు... ఎండీ దంపతుల అరెస్టు
ప్రముఖ వస్త్ర దుకాణం కళానికేతన్ ఎండీ లీలాకుమార్, ఆయన భార్య శారదలపై హైదరాబాదు సీసీఎస్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద తీసుకున్న రూ.3.5 కోట్ల అప్పు చెల్లించలేదంటూ జూబ్లీ హిల్స్ కు చెందిన ఏవీఎన్ రెడ్డి అనే ఫైనాన్షియర్ కళానికేతన్ ఎండీ లీలాకుమార్ దంపతులపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆ వెంటనే లీలాకుమార్ ను, ఆయన భార్య శారదను అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నట్టు సమాచారం.