: 'సుల్తాన్'కు జోడీగా అనుష్క శర్మ


బాలీవుడ్ నటి అనుష్క శర్మ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎనిమిదేళ్ల తరువాత నటుడు సల్మాన్ ఖాన్ తో నటించే అదృష్టం దక్కించుకుంది. అబ్బాస్ అలీ దర్శకత్వంలో ప్రస్తుతం సల్లూ 'సుల్తాన్' చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంతవరకు హీరోయిన్ ను ఎంపిక చేయలేదు. దాంతో పలువురు టాప్ భామల పేర్లు పరిశీలించినా... చివరికి అనుష్కను కన్పర్మ్ చేశారు. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అటు కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ కూడా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపి, సల్మాన్, అనుష్కల ఫోటోను కూడా షేర్ చేశారు. దాంతో 'సుల్తాన్'లో సల్మాన్ కు ఎవరు జోడీ కట్టనున్నారనే ఉహాగానాలకు తెరదించారు.

  • Loading...

More Telugu News