: విజయవాడ సబ్ జైలులో మల్లాది విష్ణును పరామర్శించిన రఘువీరా
కల్తీ మద్యం కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు అండగా ఉండేందుకు ఆ పార్టీ ముందుకొచ్చింది. ఈ మేరకు విజయవాడ సబ్ జైలులో ఆయనను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విష్ణుకు పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు. రాజకీయకక్షతోనే ఆయనను వేధిస్తున్నారని మండిపడ్డారు. మద్యం కేసులో ఫోరెన్సిక్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచినీళ్లలో విషం కలవడం వల్లే అంతమంది చనిపోయారని రఘువీరా అన్నారు.