: రాజకీయ ఉగ్రవాదానికి తెరలేపుతున్న కేసీఆర్: భట్టివిక్రమార్క
తెలంగాణలో ఇతర పార్టీలను లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదానికి తెరలేపుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ ఆలోచనా విధానం ప్రజాస్వామ్యానికే చేటు తెస్తుందన్నారు. ఇతర పార్టీల నేతలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏ ప్రాతిపదికన డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని టీ సర్కార్ ని డిమాండ్ చేశారు. మొత్తం ఓటర్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల శాతమెంతో చెప్పాలని.. ఎస్సీ, ఎస్టీ డివిజన్ల సంఖ్య పెంచాలని భట్టి విక్రమార్క సూచించారు.