: 12న టీడీపీ-బీజేపీ భారీ బహిరంగసభ
ఈ నెల 12వ తేదీన టీడీపీ-బీజేపీ భారీ బహిరంగసభ హైదరాబాద్ లో జరగనుంది. నిజాం కళాశాల మైదానంలో ఈ బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఆయా పార్టీల నేతలు ఈరోజు సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కేంద్రమంత్రి సుజనాచౌదరి, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శాసనసభాపక్షనేత లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై రెండు పార్టీలు చర్చించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు పలు అంశాలపై వారు చర్చించారు.