: సల్మాన్ ఖాన్ వివాహం ఆయన వ్యక్తిగత విషయం!: నగ్మా


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వివాహంపై ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా స్పందించారు. బీహార్ పంచాయతీ ఎన్నికల్లో మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు రోజుల నుంచి ఆమె అక్కడ పర్యటిస్తున్నారు. ఈ మేరకు అక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి, ప్రస్తుతం సల్మాన్ 50వ పడిలోకి అడుగుపెట్టినందున ఇకనైనా ఆయన పెళ్లి చేసుకోవాలంటే మీరేం సూచిస్తారని అడిగాడు. అందుకు నగ్మా కొంత అసహనానికి లోనయ్యారు. అయినప్పటికీ సమాధానమిస్తూ, మహిళా సాధికారతకు, సల్మాన్ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అదేమీ మహిళా సాధికారత సమస్య కాదని చెప్పారు. అది ఆయన వ్యక్తిగత విషయమని, ఆయన ఇష్ట ప్రకారం పెళ్లి నిర్ణయం తీసుకుంటారని నగ్మా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News