: నాకు, హరీశ్ రావుకు మధ్య విభేదాలు లేవు... 'తెలుగు రాష్ట్ర సమితి' అని సరదాగా అన్నా: కేటీఆర్


టీఆర్ఎస్ ను 'తెలుగు రాష్ట్ర సమితి'గా మారుస్తామని, తాను భీమవరం నుంచి పోటీచేస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడటంపై ఆయన స్పందించారు. తెలుగు రాష్ట్ర సమితి అని, భీమవరం నుంచి పోటీచేస్తానని సరదాగానే కామెంట్ చేశానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగువారు బాగుండాలనే తమ ఆలోచన అని చెప్పారు. ఏపీలో సీఎం కేసీఆర్ కు ఆదరణ ఉందన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాలను రాద్ధాంతం చేయడం తగదని సూచించారు. ఇక తనకు, మంత్రి హరీశ్ రావు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ తెలిపారు. ఇద్దరం రాజకీయంగా ఎదుగుతున్నామని, సీఎం ఏ బాధ్యత అప్పగించినా దానిని సాధిస్తామని వివరించారు. వారం రోజుల్లో గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఫలితాల తరువాతే మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News