: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు ముఖ్య అతిథులుగా హాజరై ఫెస్టివల్ ను ప్రారంభించారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం, పులికాట్ సరస్సు ఫ్లెమింగో పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ప్రతి ఏటా జనవరి నెలలో నిర్వహించే ఈ ఫెస్టివల్ తో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. ఫ్లెమింగో ఫెస్టివల్ ను చూసేందుకు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి అనేకమంది పక్షి ప్రేమికులు తరలిరానున్నారు.