: ముఫ్తీ అంత్యక్రియల ఫేస్ బుక్ పోస్టులపై స్మైలీస్!... జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంపై నెటిజన్ల ఆగ్రహం


జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ మరణం ఆ రాష్ట్ర ప్రజలనే కాక దేశ ప్రజలను కూడా విషాదంలోకి నెట్టేసింది. మొన్న సాయంత్రం ముఫ్తీ సొంతూరు బిజ్ బెహరాలో జరిగిన అంత్యక్రియలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను కాశ్మీర్ ప్రభుత్వం తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఘోర తప్పిదం జరిగింది. అత్యంత విషాదకరమైన ఈ ఫొటోలపై స్మైలీస్ దర్శనమిచ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలో పెను దుమారం లేపింది. నెటిజన్లు కాశ్మీర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన తప్పును తెలుసుకున్న అధికారులు ఆలస్యంగానైనా సదరు స్మైలీస్ ను తీసేశారు.

  • Loading...

More Telugu News