: ఉత్తరకొరియా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని వెల్లడించి.. ఫేమస్ అయిన యాంకరమ్మ


ఉత్తర కొరియన్ టీవీలో ఒక మహిళా న్యూస్ యాంకర్ హైడ్రోజన్ బాంబు పరీక్ష జరిగిందని ప్రకటించి ప్రపంచాన్నే వణికించింది. దీంతో ఈ యాంకరమ్మ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు పొందింది. ఆమె చాలాకాలంగా న్యూస్ యాంకర్ గా పనిచేస్తూ ఎంతో ఆదరణ పొందింది. అయితే ఇటీవలే రిటైర్ అయిన ఆమెను ఈ హైడ్రోజన్ బాంబు వార్తను చదివేందుకు ఛానల్ నిర్వాహకులు తిరిగి పిలిపించారట. రీ చున్ హీ అనే పేరుగల ఈ యాంకర్ తొలుత యాక్టర్ కావాలనుకుందట. అయితే 1971లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రారంభించిన ఛానల్ లో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. వార్తలు చదవడంలో ఏకంగా 40 ఏళ్ల అనుభవం సంపాదించిన రీ చున్ హీ తన కెరియర్ లో ఉత్తర కొరియాలో జరిగిన చారిత్రాత్మక ఘటనలన్నింటినీ కవర్ చేసిన ఘనత దక్కించుకుంది. ఈమె వార్తలు చదివేటప్పుడు అందులోని భావానికి అనుగుణంగా గొంతును మారుస్తుంటుంది.

  • Loading...

More Telugu News