: మన భాగ్యనగరంలో కోటి మంది!


ప్రపంచంలో ప్రముఖ స్థానం సంపాదిస్తున్న హైదరాబాద్ జనాభా 2015 నాటికి కోటికి చేరినట్లు అధికారుల అంచనాలు తెలియజేస్తున్నాయి. 1951లో 10.83 లక్షలు ఉన్న నగర జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది. దేశంలోని వివిధ మెట్రో నగరాలతో పోలిస్తే మన భాగ్యనగరం 6వ స్థానంలో నిలిచింది. 2011 లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 4.60 కోట్లు కాగా, ఆ తరువాతి స్థానంలో ముంబై 2.07 కోట్ల జనాభాతో, కోల్ కతా 1.46 కోట్ల జనాభాతో మూడవ స్థానం, 89.17 లక్షల జనాభాతో చెన్నై నాలుగు, 87.28 లక్షల జనాభాతో బెంగళూరు ఐదు, 78 లక్షల జనాభాతో భాగ్యనగరం 6 వ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కోటికి చేరింది. దీనికి పారిశ్రామికీకరణ, ఐటి రంగాలే కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News