: తెలుగు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: మండలి బుద్ధప్రసాద్


తమిళనాడు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో అక్కడి తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని సంతపేటలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంతో తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News