: భారత్ కు ఎలా సహకరిద్దాం?: ఉన్నత స్థాయి సమావేశంలో నవాజ్ షరీఫ్
భారత్ కు ఎలా సహకరించాలన్న అంశంపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చించారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఆరుగురు ముష్కరులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారేనంటూ పలు సాక్ష్యాధారాలను భారత్ ఆ దేశానికి అందజేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని, ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని, లేని పక్షంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీపై పునరాలోచించవలసి ఉంటుందని హెచ్చరించింది. దీంతో ఈ ఘటనపై రెండోసారి సమావేశం నిర్వహించిన పాక్ ప్రధాని ఆ భేటీలో మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం మరో రెండు రోజుల్లో మరో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.