: చాక్లెట్ తో దగ్గుకు ఉపశమనం!
చాక్లెట్ ప్రియులకు ఈవార్త శుభవార్తే. దగ్గు ఉపశమనానికి చాక్లెట్ బాగా పనిచేస్తుందని హుల్ యూనివర్శిటీ ప్రొఫెసర్, అంతర్జాతీయ దగ్గు నిపుణుడు అలైన్ మొరిస్ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. 163 మంది వ్యక్తులకు సుమారు ఒక ఏడాది పాటు క్రమం తప్పకుండా చాక్లెట్లు తినిపించామని ఆయన చెప్పారు. వీటిని తినడం కారణంగా దగ్గుకు సంబంధించిన లక్షణాలు వారిలో కనిపించలేదన్న విషయం తమ పరిశోధనలో తేలిందని అలైన్ పేర్కొన్నారు.