: గేల్ అంతే...ఇందులో ఆశ్చర్యమేముంది?: షేన్ వాట్సన్
వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ వ్యవహార శైలి అంతేనని ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తెలిపాడు. తన సమకాలీన ఆటగాడైన గేల్ పలు సందర్భాల్లో ఆటకు అవసరం లేని వివాదాలు నెత్తిన వేసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. తామిద్దరం చాలా మ్యాచ్ లు ఆడామని చెప్పిన వాట్సన్, అతిగా ప్రవర్తించడం ద్వారా గేల్ తలనొప్పులు కొనితెచ్చుకుంటున్నాడని అన్నాడు. గేల్ నుంచి ఆ రకమైన ప్రవర్తన ఊహించినదేనని వాట్సన్ పేర్కొన్నాడు. గేల్ ను బ్యాన్ చేయాలన్న దానికి వాట్సన్ మద్దతు పలికాడు. వ్యక్తిగత ప్రవర్తన వల్ల క్రికెట్ కు మచ్చ తేవడం సరికాదని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. వేసవిలో జరిగే సిరీస్ గేల్ ఆఖరి ఆసీస్ పర్యటన కావొచ్చని వాట్సన్ పేర్కొన్నాడు.