: ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించిన టీమిండియా ఆటగాళ్లు
ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరీస్ సందర్భంగా నిర్వహించిన టీట్వంటీ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ రాణించారు. ఆసీస్ లో బిగ్ బాష్ టీట్వంటీ లీగ్ లో సీనియర్ ఆటగాళ్లంతా ఆడుతుండడంతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ విఫలం కాగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ విరుచుకుపడి 46 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అతనికి కోహ్లీ (74) చక్కని సహకారమందించాడు. చివర్లో దిగిన ధోనీ (22) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 192 పరుగులు చేసింది.