: ఉగ్రవాదులు దాడికి ముందే వచ్చారా?


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రదాడికి ముందే ఇద్దరు ఉగ్రవాదులు మకాం వేశారా? అంటే అవుననే అంటున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రదాడికి ముందు రోజే అంటే డిసెంబర్ 31న ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో ప్రవేశించి ప్రణాళిక సిద్ధం చేయగా, మిగిలిన ఉగ్రవాదులు మరుసటి రోజు భారత్ లో చొరబడి దాడికి పాల్పడ్డారని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రాంతంలో వారి బ్యాగుల నుంచి పాకిస్థాన్ లో తయారైన తలనొప్పి నివారణ మందులు, సిరెంజీలు, రెడీటూ ఈట్ పొట్లాలు, ఖర్జూరం, సుగంధ పరిమళాల ప్యాకెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు భారీ ప్రణాళికతో ఎంటరయ్యారని, అయితే భద్రతా బలగాల ఆపరేషన్ ముందు వారి ఆటలు సాగలేదని వారు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News