: బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఫైనల్లో సానియా-హింగిస్ జోడి
బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్ కు ప్రపంచ నంబర్ వన్ జోడి సానియా-హింగిస్ చేరుకుంది. సెమీఫైనల్లో రష్యాకు చెందిన అంద్రెజా క్లెపక్-అల్లా కుద్రయస్తీవాపై 6-3, 7-5 వరుస సెట్లతో ఈ జోడీ విజయం సాధించడంతో ఫైనల్ కు చేరుకుంది. కాగా, గత ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన సానియా-హింగిస్ జోడి కొత్త ఏడాది లోనూ శుభారంభం పలికారు.