: జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు: వైఎస్ షర్మిల
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వారి కుటుంబాలను ఓదార్చుతానని చెప్పిన జగనన్న తన మాట నిలబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ నేత షర్మిల అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర ముగిసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం గాంధారి పోతంగల్ కలాన్ గ్రామంలో విలేకరులతో షర్మిల మాట్లాడారు. పావురాలగుట్టలో నాడు జగనన్న ఇచ్చిన మాటను ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకున్నారన్నారు. మహానేత వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక 750 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈరోజు వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నాయకుడు చనిపోతే వందల గుండెలు ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాల వారినందరినీ కలిసి ఓదార్చామని.. వారి అభిమానాన్ని గుర్తించామని.. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని షర్మిల అన్నారు.