: పాక్, ఆఫ్ఘానిస్థాన్ లలో మరోసారి భూకంపం


పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ లలో మరోసారి మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5 గా నమోదైంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్, ఆఫ్ఘానిస్థాన్ లోని హిందూకుష్ ప్రాంతాలతో పాటు జమ్ముకశ్మీర్ లోనూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘానిస్థాన్-తజకిస్థాన్ సరిహద్దులోని బదకస్థాన్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News