: హీరో నటన దర్శకుడికి నచ్చేది కాదట...'బాజీరావ్ మస్తానీ' తెరవెనుక కథ!


ఏ కథకైనా తానూహించినట్టుగానే దృశ్యరూపం ఇవ్వాలని దర్శకుడు భావిస్తాడు. అలాంటి సమయంలో తాను చెప్పినట్టు నటించకపోతే దర్శకుడికి పట్టరాని కోపం వస్తుంది. అలాంటి ఘటనే 'బాజీరావ్ మస్తానీ' సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకుందని సినిమా యూనిట్ గుర్తుచేసుకుంది. 'బాజీరావ్ మస్తానీ' షూటింగ్ సందర్భంగా రణ్ వీర్ సింగ్ ప్రదర్శన పట్ల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవాడట. పలు సందర్భాల్లో గట్టిగా మందలించేవాడట. ఓ దశలో ఈ ప్రాజెక్టు నుంచి అతనిని తప్పించాలని సంజయ్ భావించాడని యూనిట్ పేర్కొంది. అయితే, అవన్నీ గతం అని, షూటింగ్ లో ఇలాంటివి చాలా జరుగుతుంటాయని, ప్రస్తుతానికి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నామని రణ్ వీర్, సంజయ్ లీలా భన్సాలీ నవ్వుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News