: ఎస్పీ సల్వీందర్ స్నేహితుడు రాజేష్ వర్మను విచారించిన ఎన్ఐఏ


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడిపై దర్యాప్తులో భాగంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ చుట్టూ అనుమానాలు ముసురుకుంటున్న నేపథ్యంలో నాటి ఘటనలో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ వర్మను ఎన్ఐఏ అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా, తీవ్రవాదులు ఎస్పీని అపహరించినప్పుడు వారు ప్రయాణిస్తున్న కారును రాజేష్ వర్మ డ్రైవ్ చేస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులకు వెల్లడించారు. దీనిపై రాజేష్ వర్మ నుంచి ఎన్ఐఏ అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, ఎస్పీ ఆ సమయంలో గురుద్వారాకు ఎందుకు వెళ్లారు? గురద్వారా దగ్గర 9 గంటలకు బయల్దేరిన ఎస్పీ తెల్లవారు జాము వరకు ఎక్కడున్నారు? ఎస్పీని కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు అతనిని అంత సులువుగా ఎందుకు వదిలేశారు? తీవ్రవాదులు అని తెలిసిన తరువాత ఎస్పీ నేరుగా కదనరంగంలోకి ఎందుకు దూకలేదు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోవడంతో వీటికి ఎన్ఐఏ సమాధానాలు వెదుకుతోంది.

  • Loading...

More Telugu News