: డబ్బింగ్ ఆర్టిస్టు శకుంతల ఆత్మహత్యాయత్నం!
డబ్బింగ్ ఆర్టిస్టు తోట శకుంతల విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఈరోజు జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. హైదరాబాదులోని కృష్ణానగర్ లో శకుంతల కుటుంబం నివసిస్తోంది. డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడి వేధింపుల కారణంగానే శకుంతల ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.