: సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు


సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు నడుపుతుండగా, ఇప్పుడు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 9, 17 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ, ఈ నెల 10, 16 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించారు. అలాగే 13న హైదరాబాద్-కాకినాడ, 14న కాకినాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు, 17న కాకినాడ పోర్టు నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయన్నారు. ఈ నెల 11, 18 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, 18న కాకినాడ-తిరుపతి, 15న తిరుపతి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News