: అక్కడ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడితే ఫోన్ తీసేసుకుంటారు!


ఇకపై రాజస్థాన్ లో ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే కుదరదు. ఎందుకంటే, వారికి జరిమానా విధించడమే కాకుండా వారి ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. తాజాగా రాజస్థాన్ సర్కార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాజస్థాన్ హోంశాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ, రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నియమాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు ధరించే హెల్మెట్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నాసిరకం హెల్మెట్లను విక్రయించ వద్దని, వాటిని విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కటారియా ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 24 వరకు నిర్వహించే భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కొత్త నియమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News