: ఫేస్ బుక్ మెసెంజర్@ 80 కోట్ల వినియోగదారులు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ కు చెందిన ఫేస్ బుక్ మెసెంజర్ కోట్లాది మంది వినియోగదారులకు చేరువవుతోంది. తాజాగా ఈ మెసెంజర్ వినియోగించే వారి సంఖ్య 80 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుసంధానమవ్వడానికి ఈ మెసెంజర్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఫేస్ బుక్ మెసేజింగ్ ప్రోడక్ట్స్ హెడ్ డేవ్ మార్కస్ తెలిపారు. 2015 సంవత్సరం పూర్తయ్యే నాటికి తమ వినియోగదారుల సంఖ్య 80 కోట్ల మైలు రాయిని చేరడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.