: కేజ్రీకి కేంద్రం షాక్... డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్ధత లేదని ప్రకటన


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. డీడీసీఏలో జరిగిన అవినీతి వ్యవహారంపై చేపట్టిన విచారణకు ఎలాంటి చట్టబద్ధత లేదని, అది రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ వెంటనే స్పందిస్తూ, డీడీసీఏ స్కాంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కేంద్రం కావాలనే రక్షిస్తోందని ఆరోపించారు. అందుకే విచారణను అడ్డుకుంటోందని విమర్శించారు. స్కాంలో జైట్లీ ప్రమేయం లేకుంటే విచారణ అంటే భయమెందుకని ప్రశ్నించారు. ఆయన ఏ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News