: చెరకు తోటల్లో ఉగ్రవాదులు... జల్లెడ పడుతున్న స్వాత్ బలగాలు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగిన ఆరుగురు ఉగ్రవాదులతో పాటు మరో ఇద్దరు ముష్కరులు కూడా భారత భూభాగంలోకి ప్రవేశించారు. ఈ మేరకు మొన్న గురుదాస్ పూర్ జిల్లాలోని కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం నిజమనే తేలింది. గురుదాస్ పూర్ జిల్లా పంధర్ గ్రామ సమీపంలో తమకు ఉగ్రవాదులు కనిపించారని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఉగ్రవాదుల అనుపానులను తెలుసుకునేందుకు డ్రోన్ లను ప్రయోగించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న చెరకు తోటలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు డ్రోన్ లు ఇట్టే పట్టేశాయి. దీంతో అత్యాధునిక ఆయుధాల ప్రయోగంలోనే కాక ముష్కరులపై ముప్పేట దాడి చేయడంలో ఆరితేరిన స్వాత్ కమెండోలు రంగంలోకి దిగిపోయారు. ప్రస్తుతం అక్కడ చెరకు తోటను చుట్టుముట్టిన స్వాత్ బలగాలు చెరకు గడలను కొట్టేస్తూ సోదాలు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News