: గేల్ ను ప్రపంచ వ్యాప్తంగా నిషేధించాలంటున్న ఇయాన్ చాపెల్


బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టీవీ జర్నలిస్టు మెల్ మెక్ లాలిన్ తో అభ్యంతరకరంగా మాట్లాడటం వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ను తీవ్ర ఇబ్బందులలో పడేసేలా ఉంది. ఇప్పటికే పలువురి నుంచి అతనిపై వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ, గేల్ పై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, దానిపై సహనంతో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతనితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నాడు. అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా పర్వాలేదని, లేని పక్షంలో విడివిడిగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలని చాపెల్ కోరాడు. అంతేగాక గేల్ కు కేవలం రూ.6 లక్షల జరిమానాతో సరిపెడితే సరిపోదంటున్నాడు. తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతనిపై నిషేధం విధించాలనే కోరారని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News