: అమెరికా దాడుల్లో ఐఎస్ అగ్రనేత అల్ అద్నానీకి తీవ్ర గాయాలు


గతేడాది పలు దేశాలపై వరుస దాడులు చేసిన ఐఎస్ఐఎస్ పై అమెరికా, ఇరాక్ లు దాడులు మొదలుపెట్టాయి. తాజాగా ఇరు దేశాల కమాండో బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ అధికార ప్రతినిధిగా ఉన్న అబూ మహ్మద్ అల్ అద్నానీ తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తమార్పిడి చేస్తున్నట్టు ఇరాక్ జాయింట్ ఆపరేషన్స్ కమాండర్ ఒకరు తెలిపారు. 2005లో అద్నానీని అరెస్టు చేసిన అమెరికా 2010లో విడుదల చేసింది. అయినా అతని తీరు మార్చుకోకుండా ఎప్పటిలానే వ్యవహరిస్తున్నాడు. ఇస్లామిక్ స్టేట్ లో అత్యున్నత స్థాయి హోదాను అనుభవించే వారిలో అద్నానీ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన పలు హెచ్చరికల టేపులు, సందేశాల టేపుల్లో మాట్లాడింది కూడా అతనే అని ప్రపంచం మొత్తానికి తెలుసు.

  • Loading...

More Telugu News