: ‘సిద్దిపేట’ పల్లెలో ఉద్రిక్తత... సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు


ఓ యువకుడి అనుమానాస్పద మృతి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇబ్రహీంపూర్ లోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. అయితే అతడు నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సర్పంచ్ కుమారుడు కొట్టడంతోనే అతడు మరణించాడని బాధితుడి బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో వారంతా కలిసి నేటి ఉదయం సర్పంచ్ ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. అంతేకాక సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. యువకుడి మరణం, సర్పంచ్ ఇంటికి నిప్పు నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News