: రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణు అరెస్ట్... పోలీసుల చర్య కోర్టు ధిక్కరణే!: రఘువీరారెడ్డి


కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ ను కూడా సిట్ పోలీసులు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వారిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసుల ముందు విచారణకు హాజరైతే, అరెస్ట్ ఉండబోదని కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే నెల పాటు కొనసాగించిన అజ్ఞాతాన్ని మల్లాది వీడారు. రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు నిన్న రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. మల్లాది అరెస్ట్ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News