: ఆ ‘ఉస్తాద్’ జేషే చీఫ్ మసూద్ అజారే!... పఠాన్ కోట్ ప్రధాన కుట్రదారు అతడేనని నిర్ధారణ


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని తమ బాస్ కు ఫోన్ చేశారు. సదరు ఫోన్ సంభాషణలో వారు తమ బాసును ‘ఉస్తాద్’ అంటూ సంబోధించారు. అతడు ఎవడో కాదు... ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్. ఈ మేరకు పఠాన్ కోట్ దాడి దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చేసింది. మౌలానా మసూద్ అజార్ తో పాటు అతడి సోదరుడు రవూఫ్ కూడా ఈ దాడి వ్యూహకర్తల్లో ఒకడిగా వ్యవహరించాడు. వీరిద్దరితో పాటు పాక్ గడ్డ మీద నుంచే మరో నలుగురు దాడిని అనుక్షణం పర్యవేక్షించారు. వారిని మౌలానా అష్పక్ అహ్మద్, హఫీజ్ అబ్దుల్ షకూర్, ఖాసీం జాన్, ఎంఎం అజార్ లుగా గుర్తించారు. మొత్తం ఈ ఆరుగురు కలిసి పఠాన్ కోట్ పై దాడికి పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదుల కదలికలను నిత్యం పర్యవేక్షించారు. ఇక ఈ దాడికి కుట్ర జరిగింది మాత్రం పాకిస్థాన్ లోని మర్కాజ్ పట్టణంగా దర్యాప్తు అధికారులు తేల్చారు. ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తు అధికారులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News