: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు... 24 రైళ్లు రద్దు, విమానాల రాకపోకలకు అంతరాయం
ఉత్తర భారతాన్ని చలి పులి చుట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఫలితంగా ఢిల్లీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలు కావస్తున్నా, రోడ్లపై లైట్లు లేనిదే వాహనాలు ముందుకు కదలడం లేదు. కేవలం పది మీటర్ల దూరంలోని వాహనాలు లైట్లేసుకుని వస్తున్నా కనిపించడం లేదు. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దట్టమైన పొగమంచు కారణంగా 24 రైళ్లను రద్దుచేశారు. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 19 రైళ్లను అధికారులు నిలిపేశారు. ఇక విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాదాపు 60 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.