: జమ్ము, కాశ్మీర్ సీఎంగా మహబూబా ప్రమాణం నేడే!
జమ్ము, కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణానంతరం తాజాగా అతని కుమార్తె, పి.డి.పి నేత మహబూబా ముఫ్తీ నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేయనున్నారు. ఇంతకు ముందు జమ్ముకాశ్మీర్ లో 4 రోజుల సంతాపదినాల అనంతరం మహబూబా సీఎంగా ప్రమాణం చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే పి.డి.పి నేత ముజఫ్ఫర్ హుస్సేన్ బేగ్, అల్తాఫ్ బుఖారీలు తాము నూతన ముఖ్యమంత్రిగా మహబూబాను ఎన్నుకున్నట్లు గురువారం గవర్నర్ ఎన్. ఎన్ వోహ్రాకు లేఖ అందించారు. దీంతో గవర్నర్ దీనికి ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది. కాగా మహబూబా సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం 15 రోజుల్లోగా ఆమె అసెంబ్లీలో తన మద్దతు నిరూపించుకోవాల్సివుంటుంది.