: ఆనందీబెన్ జీ... మీది పటేల్ సామాజిక వర్గమేనా?: గుజరాత్ సీఎంకు హార్దిక్ ఘాటు లేఖ!


పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లిన యువ సంచలనం హార్దిక్ పటేల్ జైలుకెళ్లినా, తన పంథాను మార్చుకోలేదు. జైలు గోడలు తన ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చలేవని ఆయన తేల్చిచెప్పారు. గుజరాత్ లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం నేపథ్యంలో హార్దిక్ పై రెండు రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన సూరత్ జైల్లో రెండు నెలలుగా కాలం వెళ్లదీస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన నేరుగా గుజరాత్ సీఎం ఆనందీబెన్ కు ఓ లేఖ రాశారు. ఘాటు వ్యాఖ్యలతో కూడిన సదరు లేఖలో ‘ఆనందీబెన్ జీ మీరు పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారేనా?’’ అని ప్రశ్నించి ఆయన సంచలనం రేపారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆనందీబెన్... పటేళ్లను స్వార్థపరులుగానే కాక దొంగలుగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లేఖాస్త్రం సంధించిన హార్దిక్ పటేల్... ఆనందీబెన్ పటేల్ సామాజిక వర్గానికి చెందినవారేనా? అన్న అనుమానం కలుగుతోందని ఆక్రోశం వెళ్లగక్కారు.

  • Loading...

More Telugu News