: మోదీ అధికారంలోకి వచ్చాకే మతవాద శక్తుల ప్రమేయం పెరిగింది: సీపీఐ నేత డి. రాజా
ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాకే దేశంలో మతవాద శక్తుల ప్రమేయం పెరిగిపోయిందని సీపీఐ జాతీయ నేత డి. రాజా ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాతనే సంఘ్ పరివార్ లాంటి మతవాదశక్తుల ప్రమేయం రాజకీయాల్లో పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఫలితంగానే రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు వెల్లడించారు.