: సంజయ్ దత్ ను ముందుగా విడుదల చేయవద్దు...బాంబే హైకోర్టులో పిటిషన్
ముంబై పేలుళ్ల కేసులో 5 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు, 'మున్నాభాయ్' సంజయ్ దత్ ను సత్ప్రవర్తన పేరుతో ముందుగా విడుదల చేయవద్దంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అతని శిక్షాకాలం ముగియక ముందే విడుదల చేయడం తగదని, మిగిలిన శిక్షాకాలాన్ని కొనసాగించాలని పిటిషనర్ ప్రదీప్ భలేకర్ తన అభ్యర్థనలో పేర్కొన్నారు. కాగా సంజయ్ దత్ ఇంకా 18 నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉండగానే అతని సత్ప్రవర్తనను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను ముందుగానే విడుదల చేయాలని భావించింది. అయితే తాజాగా కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ తో సంజయ్ విడుదలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా ఈ పిటిషన్ పై వచ్చేవారం విచారణ జరగనుంది. సంజయ్ దత్ కు అనుకూలంగా జైలు అధికారి వ్యవహరించారని పిటిషనర్ ఆరోపించారు.