: అవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్!... రూ.10 కట్టొద్దంటున్న బైరెడ్డి


రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నిన్న కర్నూలు కేంద్రంగా ఏపీ ప్రజలకు ఓ వింత పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నింటినీ ఆయన ‘కాక్ అండ్ బుల్ స్టోరీస్’ (కాకమ్మ కథలు)గా అభివర్ణించారు. ప్రభుత్వం చెబుతున్న మాయ మాటలు విని మోసపోవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాక రాజధాని నిర్మాణం కోసం తలా ఓ చేయి వేయాలన్న చంద్రబాబు పిలుపునకు ఏ ఒక్కరూ స్పందించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. రాజధాని నిర్మాణం పేరిట కల్లబొల్లి మాటలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ఒక్కొక్కరి నుంచి రూ.10 చొప్పున సేకరించేందుకు తెరలేపిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా, అది మీ డబ్బుతోనే కట్టిన రాజధాని అంటూ మన నోళ్లు మూయిస్తారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా రాజధాని నిర్మాణం కోసం రూ.10 ఇవ్వాల్సిన అవసరం లేదని బైరెడ్డి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News