: మల్లాది విష్ణు అరెస్ట్... బెజవాడలో అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు


బెజవాడలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగరంలో గత నెలలో వెలుగుచూసిన కల్తీ మద్యం ఘటనకు సంబంధించిన కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. విష్ణుతో పాటు ఆయన సోదరుడు, కల్తీ మద్యం ఘటన వెలుగు చూసిన కృష్ణలంక స్వర్ణ బార్ యజమాని మల్లాది శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు నెల పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయిన మల్లాది విష్ణు నాలుగు రోజుల క్రితం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బుధ, గురువారాల్లో దాదాపు 25 గంటల పాటు ఆయనను సిట్ పోలీసులు విచారించారు. దాదాపు అరెస్ట్ ఉండదని భావించినప్పటికీ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మల్లాది సోదరులను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రాత్రంతా తమ అదుపులోనే ఉంచుకున్న సిట్ పోలీసులు నేడు వారిద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News