: ఇండియాలో సేవలు ప్రారంభించిన వీడియో స్ట్రీమింగ్ కంపెనీ 'నెట్ ఫ్లిక్స్'


అమెరికాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ కంపెనీ 'నెట్ ఫ్లిక్స్' భారత్ లో సర్వీసులు ప్రారంభించింది. భారత్ తో పాటు 130 దేశాల్లో ఈ సేవలు ప్రారంభిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. 2016 సంవత్సరాంతానికి 200 దేశాల్లో సేవలు విస్తరించడమే లక్ష్యమని 'నెట్ ఫ్లిక్స్' ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు, టీవీ సీరియళ్లు, ప్రత్యేక ప్రదర్శనలను 'నెట్ ఫ్లిక్స్' ప్రసారం చేస్తుంది. ఇలా ప్రసారం చేయడానికి కాపీ రైటు హక్కులను 'నెట్ ఫ్లిక్స్' కలిగి ఉంటుంది. భారత్ లో సేవలు ప్రారంభించిన సందర్భంగా 30 రోజుల కాలపరిమితితో మూడు ప్యాక్ లను ఈ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో దేనినైనా కొనుగోలు చేయడం ద్వారా నెల రోజులపాటు ఉచితంగా వీడియోలు చూడవచ్చని 'నెట్ ఫ్లిక్స్' ఆఫర్ ఇచ్చింది. 500 రూపాయల విలువైన 'బేసిక్ ప్లాన్' లో స్టాండర్డ్ క్వాలిటీతో వీడియోలు వీక్షించవచ్చు. 650 రూపాయల విలువైన 'స్టాండర్డ్ ప్లాన్' లో హెచ్డీ క్వాలిటీతో వీడియోలు వీక్షించవచ్చు. 850 రూపాయల 'ప్రీమియం ప్లాన్' లో 4కే రిజల్యూషన్ కలిగిన వీడియోలను వీక్షించవచ్చు.

  • Loading...

More Telugu News