: బ్రిటిష్ పాలనను గుర్తు తెస్తున్నారంటూ గుజరాత్ ముఖ్యమంత్రికి లేఖ పంపిన హార్దిక్ పటేల్
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం విభజించు- పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని గుజరాత్ పటేల్ యువనేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. దేశద్రోహం కేసులో గుజరాత్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న హార్దిక్ పటేల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ కు లేఖ పంపారు. పటేళ్ల డబ్బు, ఓట్లు వాడుకుని బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారం చేపట్టిన తరువాత 10 మంది పటేల్ యువకులను బీజేపీ ప్రభుత్వం హత్య చేసి, వందల మందిని జైలు పాలు చేసిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఠం శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. తన విడుదలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వారిని విరమించుకోవాలని ఆయన మరో లేఖలో కోరారు.