: హైకోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: కేసీఆర్
హైకోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో లక్ష మంది ఉద్యోగులు బాధ్యతలు పంచుకోవాల్సి ఉందని అన్నారు. సుమారు లక్ష మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటే హైదరాబాదు అభివృద్ధి కుంటుపడుతుందని తక్కువ వ్యవధిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.