: వీరిలో 'ఇంక్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్త ఎవరు?


కేంద్ర ప్రభుత్వం 'ఇంక్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్త వేటలో మునిగిపోయింది. మత అసహన వ్యాఖ్యలతో అమీర్ ఖాన్ ను ప్రచారకర్త బాధ్యతల నుంచి తొలగించిన తరువాత ఆ స్థాయిలో బ్రాండ్ వేల్యూ పెంచే సెలెబ్రిటీని నియమించే విషయంలో కేంద్రం తర్జన భర్జనలు పడుతోంది. ఈ సందర్భంగా నలుగురు బాలీవుడ్ నటీనటుల పేర్లను పరిశీలిస్తోంది. వారిలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్ర అంబాసిడర్ గా ఉన్న బిగ్ బీ దీనిని అంగీకరిస్తాడా? అనే సమాధానం వినిపిస్తోంది. తరువాతి పేరు రైతులను ఆదుకునేందుకు నడుం బిగించిన అక్షయ్ కుమార్. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్న ఇతనైతే బ్రాండ్ వేల్యూ పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. అక్షయ్ మహిళా రక్షణకు పలు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అతని తరువాతి స్థానంలో ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనేలు ఉన్నారు. వీరిలో ఎవరు ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా నిలుస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News