: సచిన్ నుంచి బహుమతిని అందుకున్న ప్రణవ్ ధనవాడే
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్వహించిన ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో 1009 పరుగులతో సత్తాచాటిన ప్రణవ్ ధనవాడేకు అరుదైన బహుమతి లభించింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ స్వహస్తంతో సంతకం చేసిన బ్యాట్ ను ధనవాడేకు బహుమతిగా అందజేశాడు. సచిన్ ను క్రికెటర్లు దేవుడిగా భావిస్తారు. అతని నుంచి ప్రశంస వస్తేనే ఉత్సాహం ఉప్పొంగుతుంది. అలాంటి సచిన్ బహుమతి ఇస్తే, అది వర్ధమాన క్రికెటర్లలో స్పూర్తి నింపుతుంది. మంచి ఇన్నింగ్స్ తో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ప్రణవ్ ప్రదర్శనను ప్రశంసించిన సచిన్, అతనికి బ్యాట్ బహుమతిగా అందజేసి తన ఉన్నతిని చాటుకున్నాడని బీసీసీఐ తెలిపింది. దీంతో ప్రణవ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.