: పఠాన్ కోట్ దాడిపై పాకిస్థాన్ ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ మంత్రులు, సైనికాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పఠాన్ కోట్ దాడిపై భారత్ అందించిన సాక్ష్యాధారాలపై చర్చ జరుపుతున్నారు. పఠాన్ కోట్ దాడిలో జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ హస్తం ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ఘటన వెనుక మౌలానా మసూద్ అజహర్, ఆయన సోదరుడు, మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ చర్యల వల్ల ఎదురయ్యే పరిణామాలు ఏమిటి? అనే వాటిపై ఆ సమావేశంలో చర్చిస్తున్నారు.