: నాకు కేన్సర్ లేదు: మైఖేల్ జాక్సన్ సోదరి జానెట్ జాక్సన్
తనకు కేన్సర్ సోకలేదని ప్రముఖ పాప్ సింగర్ జానెట్ జాక్సన్ తెలిపింది. గతంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, డాక్టర్లు తక్షణం ఆపరేషన్ చేయాలని సూచించారని జానెట్ జాక్సన్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు తెలిపింది. వెంటనే తాను ఇవ్వాల్సిన స్టేజ్ షోలను కూడా రద్దు చేసుకుంది. దీంతో ఆమెకు కేన్సర్ సోకిందని వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన జానెట్ జాక్సన్ తనకు కేన్సర్ సోకలేదని స్పష్టం చేసింది. పుకార్లను నమ్మొద్దని తెలిపింది. తాను రద్దు చేసుకున్న స్టేజ్ షోలను కూడా పూర్తి చేస్తానని జానెట్ వెల్లడించింది. 2009లో మైఖేల్ జాక్సన్ మరణించిన అనంతరం మ్యూజిక్ కు ఆమె దూరంగా ఉంది. రెండేళ్ల తరువాత ప్రదర్శనలివ్వడం ప్రారంభించిన జానెట్, అనారోగ్య కారణంగా ప్రదర్శనలకు మళ్లీ దూరంగా ఉంది.