: మోదీ మౌనం వీడండి...ఏం జరిగిందో చెప్పండి: ఏకే ఆంటోనీ
ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటొనీ కోరారు. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పఠాన్ కోట్ లో ఏం జరిగిందో ప్రధాని జాతికి వివరించాలని అన్నారు. ఉగ్రవాద చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వెంటనే ఈ ఘటన జరగడం తీవ్రమైన వ్యవహారమని ఆయన చెప్పారు. దీనిని ఆషామాషీగా పరిగణించకూడదని ఆయన పేర్కొన్నారు. పాక్ పర్యటన నుంచి పఠాన్ కోట్ వ్యవహారం వరకు ఏం జరిగిందో జాతికి మోదీ వివరించాలని ఆయన తెలిపారు.