: తెలంగాణ పుణ్యం వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతోంది: కేటీఆర్
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతోందంటే అదంతా తెలంగాణ పుణ్యమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోకుండా ఉంటే అభివృద్ధి చెందేవా? అని ప్రశ్నించారు. ఇవాళ విడిపోవడం వల్ల అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఒక రకంగా ఆంధ్రాలో అభివృద్ధికి తెలంగాణయే కారణమని చెప్పారు. మల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ, ఆంధ్రాలో ఇవాళ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి, ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయనడానికి తెలంగాణ, ఆంధ్రా రెండుగా విడిపోవడమే కారణమని ఉద్ఘాటించారు.