: సినిమా హాళ్లు కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నాయి...మద్రాసు హైకోర్టులో కేసు
చెన్నైలో సినిమా హాళ్లు ప్రభుత్వ నిబంధనల కంటే అధిక ధరను వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడు ప్రభుత్వం 2009 మే 20న జారీ చేసిన జీవో ప్రకారం సినిమా హాళ్లు టికెట్ ధర 120 రూపాయలకు మించి వసూలు చేయకూడదని పేర్కొందని, అయితే తన నుంచి ఓ సినిమా హాలు టికెట్ ధరగా 200 రూపాయలు వసూలు చేసిందని, ఇలా వసూలు చేయడం ద్వారా సినిమా హాళ్లు ఏటా వంద నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరిన దేవరాజన్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ పుష్ప సత్యనారాయణన్ తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కు న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.